: సీఎంతో సీమాంధ్ర నేతల భేటీ
సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పలువురు సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. ఏపీఎన్జీవోల సభ నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలు, బంద్ ప్రభావం వంటి పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారని సమాచారం. కాగా ఈ సమావేశంలో మంత్రులు కాసు కృష్ణారెడ్డి, టీజీ వెంకటేష్, విశ్వరూప్, పితాని సత్యనారాయణ, ఎంపీ లగడపాటి రాజగోపాల్ లు ఉన్నారు.