: ఉద్యోగులకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భోజనాలు పెడుతున్నారు: హరీశ్
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ నిర్వహణ వెనక రాజకీయనేతలున్నారని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మరో అడుగు ముందుకేశారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి తరలి వస్తున్న ఉద్యోగులకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భోజనాలు పెడుతున్నారంటూ టీడీపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. పైగా సభ పాస్ లను ఎవరికిపడితే వారికి ఇచ్చేస్తున్నారని మండిపడ్డారు. తద్వారా ఏపీఎన్జీవోల ముసుగులో అసాంఘిక శక్తులు సభలో ప్రవేశించే అవకాశం ఉందని హరీశ్ అభిప్రాయపడ్డారు.