: ఉత్తరాఖండ్ లో బయటపడుతున్న మృతదేహాలు
వరద తీవ్రతతో రెండు నెలల కిందట శ్మశానంగా మారిన ఉత్తరాఖండ్ లో ఇంకా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా, గత నాలుగురోజుల్లో కేదార్ నాథ్ వ్యాలీలో పోలీస్ బృందాలు 160 శవాలు బయటికి తీశాయి. దహన సంస్కారాలకు ముందు వాటికి డీఎన్ఏ పరీక్ష చేసి, పోస్ట్ మార్టమ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, మరికొన్ని రోజుల పాటు ముప్పైమంది పోలీసులు, ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది జంగిల్ చట్టీ, రాంబాడా, గౌరీగాన్, భీమ్ బలి ప్రాంతాల్లో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టనున్నారు.