: సచివాలయ మహిళా ఉద్యోగుల సారథ్యంలో ఎల్బీస్టేడియానికి ర్యాలీ
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఎల్బీస్టేడియం వద్దకు ర్యాలీగా బయల్దేరారు. ఈ ఉదయమే సచివాలయ ప్రాంగణానికి చేరుకున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులంతా ర్యాలీగా బయల్దేరారు. ప్రధానంగా మహిళలు ఈ ర్యాలీలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. సచివాలయంలో 600 మంది మహిళా ఉద్యోగులు ఈ ర్యాలీకి సారథ్యం వహిస్తున్నారు.