: మా హక్కులనే కాలరాస్తారా?: ఈటెల
తెలంగాణ వాదులతో కలిసి అసెంబ్లీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన టీఆర్ఎస్ నేతలు తమను శాసనసభ ప్రాంగణంలోకి ప్రవేశించనీయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసిన సందర్భం ఇదని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఇలాంటి అవమానకర చర్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు.