: సభ వెనుక రాజకీయనేతలు: హరీశ్ రావు ఆరోపణ
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నేడు ఏపీఎన్జీవోలు జరుప తలపెట్టిన సభ వెనుక రాజకీయ నేతలున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఈ సభ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉదయం తెలంగాణ వాదులతో అసెంబ్లీ వరకు బైక్ ర్యాలీ చేపట్టిన హరీశ్ రావును అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సభకు వచ్చే వారి కోసం బస్సులు, సభా ప్రాంగణం కోసం ఏర్పాట్లు ఎవరు చేశారో అందరికీ తెలుసన్నారు. ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ళకు నిధులెక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.