: ఓయూ విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు.. రాళ్లదాడి
ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభా ప్రాంగణం ఎల్బీ స్టేడియం వైపు వచ్చేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున బయల్దేరారు. పరిస్థితిని గమనించిన పోలీసులు విద్యార్థులను క్యాంపస్ ఎన్ సీసీ గేటు వద్దే అీడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసులతో వాదనకు దిగారు. విద్యార్థులు ముందుకు రాకుండా పోలీసులు ముళ్లకంచెలు, బ్యారికేడ్లనే ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వుతున్నారు.