: గుండెల్లో పెట్టుకుంటామన్నది చేతల్లో చూపించాలి: అశోక్ బాబు


విడిపోతే సీమాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్న తెలంగాణ వాదులు దానిని చేతల్లో చూపించాలని ఏపీఎన్జీవోల నేత అశోక్ బాబు అన్నారు. విడిపోతే వచ్చే సమస్యలపై చర్చించేందుకే సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. సభకు ఉద్యోగులు తరలి వస్తున్నారని, తెలంగాణ వాదులు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని కోరారు. తెలంగాణ వారు చెబుతున్నది ఆలకిస్తే దేశంలో కొత్తగా 16 రాష్ట్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం వెనక్కి తగ్గే వరకూ సీమాంధ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మెను విరమించే ప్రసక్తే లేదన్నారు. విభజనపై కేంద్రం ముందుకే వెళితే నగరంలో మిలియన్ మార్చ్ (10 లక్షల మందితో) నిర్వహిస్తామని హెచ్చరించారు. మరోవైపు టీజేఏసీ బంద్ కు పిలుపునివ్వడం దారుణమని, హోటల్స్ మూతబడడంతో సభకు వచ్చిన వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేయలేకపోయామని అశోక్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News