: లేటైతే తప్పే!


మీరు ఏదైనా ప్రశ్నకు సమాధానం ఆలస్యంగా చెప్పినట్టైతే అది తప్పయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయట. అయితే అది నేరుగా కాదులెండి... మనం ఫోన్‌లో మెసేజ్‌లు పంపుతుంటాం కదా... ఇలా మెసేజ్‌లు పంపడంలో మనం అవతలివారు అడిగిన ప్రశ్నలకు బదులు ఎస్‌ఎంఎస్‌ పంపడంలో లేటైతే మనం చెప్పే సమాధానం తప్పట... చకచకా ఎస్సెమ్మెస్‌లు పంపేవారు... ఏదైనా ఒక ప్రశ్నకు బదులివ్వడంలో ఆలస్యం చేస్తే... వారు ఇచ్చే సమాధానం తప్పు అయ్యే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దీనిపై వారు ప్రత్యేక అధ్యయనం చేసి మరీ చెబుతున్నారు.

నెబ్రస్కా`ఇమాహా, అరిజోనా విశ్వవిద్యాలయాల్లో ఒక ప్రత్యేక తరహా సాధనాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఈ సాధనంతో ఆన్‌లైన్‌ అబద్ధాలను గుర్తించవచ్చని పరిశోధకులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా సెల్‌ఫోన్‌లు చకచకలాడుతుంటాయి. వాటినుండి తమ స్నేహితులకు, సన్నిహితులకు ఎస్సెమ్మెస్‌లు పంపుతుంటారు. అయితే చకచకా ఎస్సెమ్మెస్‌లు ఇచ్చేవారు, ఎప్పుడైన అవతలివారికి బదులివ్వడానికి కొంత సమయాన్ని తీసుకున్నట్టైతే వారిచ్చే సమాధానాన్ని కాస్త అనుమానించాల్సి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నిజాలు చెప్పడానికి ఎవరు కూడా ఎక్కువ సమయాన్ని తీసుకోరు. పైగా వారు చెప్పే విషయాలకు సంబంధించిన వివరాలను కూడా చక్కగా రాస్తారు.

అలాకాకుండా ఇచ్చే సమాధానాన్ని చిన్న సందేశం రూపంలో పంపినా... దాన్ని పంపడానికి కొంత ఆలస్యం అయినా కూడా వారు కచ్చితంగా నిజాలు రాయడం లేదని దాని అర్ధమని అవతలివారు గుర్తించాలని పరిశోధకులు చెబుతున్నారు. పైగా మనిషికి స్వతహాగానే మోసాన్ని, అబద్ధాన్ని గుర్తించగలిగే శక్తి ఉంటుంది. అయితే డిజిటల్‌ సందేశాల వెనుక ఉండే మోసాన్ని గ్రహించడం మాత్రం కష్టమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎదుటివారు సమాధానం చెప్పే సమయంలో వారు అవతలి వ్యక్తిని చూడలేరు, వారు చెప్పే స్వరాన్ని వినలేరు. కాబట్టే ఆన్‌లైన్‌లో చెప్పే అబద్ధాలను గుర్తించే ఒక ప్రత్యేక పరికరం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ తరహాలో ఒక పరికరాన్ని కూడా పరీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News