: వీడియో గేములతో అక్షరాలు దిద్దిస్తుంది!


అదొక బొమ్మ చేయి... అంటే రోబో చేయి... ఈ చేయి మీ పిల్లలకు ఎంచక్కా అక్షరాలను నేర్పుతుంది. మీ పిల్లలకు చక్కటి రాతను ఇది నేర్పిస్తుంది. మీ పిల్లలు సరిగ్గా రాయలేకపోతున్నా... అక్షరాలు తప్పులుగా దిద్దుతున్నా ఇది చక్కగా వాటిని సవరిస్తుంది. ఇలాంటి ఒక రోబో చేయిని శాస్త్రవేత్తలు రూపొందించారు. తాము రూపొందించిన చేయితో మీ పిల్లలకు చక్కగా అక్షరాలు నేర్పడంతోబాటు మంచి రాత కూడా వస్తుందంటున్నారు.

లండన్‌లోని లీడ్స్‌ విశ్వవిద్యాలయం, బ్రాడ్‌ఫోర్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ రీసెర్చ్‌ సంస్థలు అమెరికా ఇండియానా విశ్వవిద్యాలయంతో కలిసి ఒక పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరం రోబో బొమ్మలాగా ఉండే ఒక మరచేయి. ఈ చేయి మీ పిల్లల చేత అక్షరాలు దిద్దిస్తుంది. ఈ బొమ్మ చేయి ఛాతికి ఒక కంప్యూటర్‌ తెర ఉంటుంది. బొమ్మపైనుంచి పిల్లల చేయిని చుట్టుకునే తీగ వేలాడుతూ ఉంటుంది. దానికో పెన్ను వేలాడుతుంటుంది. కంప్యూటర్‌ తెరపై వచ్చే వీడియో గేములు... వాటిలో కనిపించే అక్షరాలకు అనుగుణంగా పిల్లలు పెన్నును కదిలించాల్సి వుంటుంది. అక్షరాలు తప్పుగా దిద్దుతున్నా ఈ చేయి సవరిస్తుందట.

  • Loading...

More Telugu News