: షూటర్ అభినవ్ బింద్రాపై ఐఓఏ అధ్యక్షుడు ఆరోపణలు


భారత షూటర్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రాపై భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు (ఐఓఏ)అభయ్ చౌతాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి అధికారుల వల్ల బింద్రాకు సమస్య ఉంటే ముందు తన తండ్రిని ఇంటి నుంచి బయటికి పంపాలన్నారు. లేదా తనే ఇంటినుంచి బయటికి రావాలన్నారు. ఒకప్పుడు అతని తండ్రి జైలు అధికారిగా పని చేశారని గుర్తు చేశారు. ఇండియన్ స్పోర్ట్స్ క్లీన్ అప్ కాంపైన్ లో బింద్రా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఓ ఆంగ్ల వార్తా ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత ఒలింపిక్ అసోసియేషన్ పై బింద్రా చేసిన కొన్ని వ్యాఖ్యలపై చౌతాలా మండిపడ్డారు. కాగా, హర్యానాలో ఉపాధ్యాయుల నియామకంలో చోటుచేసుకున్న కుంభకోణంలో చౌతాలా ప్రస్తుతం నిందితుడిగా ఉన్నారు.

  • Loading...

More Telugu News