: పదేసి కోట్ల రూపాయలు చెల్లించేందుకు బొత్స బేరాలాడుతున్నారు: ఉమ
తెలంగాణ బిల్లు ఆమోదింపజేసేందుకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ బేరసారాలు సాగిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఒక్కో ఎమ్మెల్యేకు 10 కోట్ల రూపాయలిచ్చి బిల్లు ఆమోదింపజేసేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఆ కారణంగానే ఆయన ముందు నుంచి తెలంగాణకు అనుకూలమని చెప్పుకుంటున్నారని ఉమ తెలిపారు.