: శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధాని చేయాలి: బైరెడ్డి


ప్రత్యేక రాయలసీమే అన్ని సమస్యలకు పరిష్కారమని రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధానిగా చేయాలని పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన ఆయన ప్రత్యేక రాయలసీమను ఏర్పాటుచేయాలని విన్నవించారు. కొంతమంది ఉన్మాదులు వారి స్వార్ధపూరిత ప్రయోజనాల కోసం రాయల తెలంగాణ ప్రచారాన్ని తీసుకొచ్చారన్న బైరెడ్డి.. ఢిల్లీలో ఆ వాదాన్ని బాగా ప్రచారం చేశారన్నారు. ఇక కొత్త రాజధానిపై సీమాంధ్రలో ఎవరికీ ఏకాభిప్రాయం లేదన్నారు.

  • Loading...

More Telugu News