: చంద్రబాబు పుట్టుక తెలుగుతల్లికే అవమానం: షర్మిల


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ నేత షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సమైక్య శంఖారావం సభలో పాల్గొన్న షర్మిల ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, చంద్రబాబు పుట్టుక తెలుగుతల్లికే అవమానం అని పేర్కొన్నారు. బాబు తెలుగు గడ్డ మీద పుట్టినందుకు తెలుగుతల్లి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబు ఇప్పుడే ఏ ముఖం పెట్టుకుని సీమాంధ్రలో బస్సు యాత్ర చేస్తారని ప్రశ్నించారు. పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోసిన చంద్రబాబును ప్రజలు నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News