: అప్రజాస్వామిక ప్రకటనలు వెనక్కి తీసుకోండి: అశోక్ బాబు


సభను అడ్డుకుంటామంటూ వివిధ సంఘాలు చేస్తున్న ప్రకటనలు అప్రజాస్వామికమని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. తక్షణమే ఆ ప్రకటనలు వెనక్కి తీసుకోవాలని లేకుంటే, తెలంగాణ వాదంలో పసలేదని భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ.. సభను అడ్డుకోవడమంటే తెలంగాణ వాదంలో బలం లేదని మీరే ప్రజలకు చెప్పినట్టవుతుందని అన్నారు. తెలంగాణ వాదులు గతంలో ఎన్నో సభలను హైదరాబాదులో నిర్వహించుకున్నారని, మిలియన్ మార్చ్ వంటి ర్యాలీలకు ప్రభుత్వం అనుమతి లేకున్నా కోర్టుకెళ్ళి అనుమతి తెచ్చుకున్నారని వివరించారు. కాగా, లక్షమందికి మించి సభకు హాజరయ్యే అవకాశం ఉందని అశోక్ బాబు చెప్పారు. సభ సందర్భంగా ఎవరైనా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే సంయమనం పాటించాలని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఉద్యోగులకు సూచించారు.

  • Loading...

More Telugu News