: ముంబయి పేలుళ్ల ఘటనలో మరో వ్యక్తి ఉన్నాడు: భత్కల్
సంచలనం సృష్టించిన 2011 జులై 13 ముంబయి పేలుళ్ల ఘటనలో మరో వ్యక్తి ఉన్నాడంటూ ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ఎన్ఐఏకు తెలిపాడు. తన అనుచరుడైన మహ్మద్ తషీన్ అక్తర్ తనతో పాటు పేలుళ్లలో పాలుపంచుకున్నాడని విచారణలో పేర్కొన్నాడు. దాడి అనంతరం వకాస్ అహ్మద్ షేక్ అనే మరో నిందితుడు సిటీలోనే ఉండి కామెర్ల వ్యాధికి జేజే ఆసుపత్రి లో చికిత్స తీసుకున్నట్లు చెప్పాడు. వకాస్ జ్వరం, కాలేయ వ్యాధితో తొమ్మిది రోజుల పాటు చికిత్స పొందినట్టు వెల్లడించాడు. ఇక హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుమానిస్తున్న వారిలో వకాస్ కూడా ఒకడు.