: రాజధానికి గూండాలొచ్చారు: హరీశ్ రావు
ఏపీఎన్జీవోల సభ ముసుగులో హైదరాబాద్ నగరంలోకి సీమ గూండాలు, బెజవాడ రౌడీలు ప్రవేశించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. ఈ హంతకముఠాలు 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీఎన్జీవోల సభ విషప్రయోగంలాంటిదని చెబుతూ, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తెలంగాణ భవన్లో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఏపీఎన్జీవోలకు వంతపాడుతున్న సీఎం కిరణ్ 13 జిల్లాలకే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ దినేశ్ రెడ్డి కూడా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. రేపటి బంద్ సందర్భంగా ఎవరు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని హరీశ్ తెలంగాణ వాదులకు సూచించారు.