: ఏపీఎన్జీవోలు సభ పెట్టుకుంటే తెలంగాణకు నష్టమేంటి?: కనుమూరి
ఏపీఎన్జీవోలు హైదరాబాద్ లో సభ పెట్టుకోవడం వల్ల తెలంగాణకు జరిగే నష్టమేంటో తెలపాలని కాంగ్రెస్ ఎంపీ కనుమూరి బాపిరాజు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, స్వేచ్ఛ అందరికీ ఉందని రాజధానిలో ఎవరైనా సభ పెట్టుకునే హక్కు ఉందని అన్నారు. నిజాం అనుమతి ఇవ్వకపోయినా సభ జరిపిన గతాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. ఏపీఎన్జీవోల వల్ల జరిగే నష్టం ఏదీ ఉండదని, ఇలా సభలను, సమావేశాలను అడ్డుకోవడం వల్ల ఏ రకమైన సందేశం ఇస్తున్నారో తెలంగాణ వాదులు పునఃసమీక్షించుకోవాలని ఆయన కోరారు.