: సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తోంది: కావూరి
సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తోందని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. పార్లమెంటు ఆవరణలో ఆయన మాట్లాడుతూ, ఆంటోనీ కమిటీకి సీమాంధ్ర ప్రజల మనోభావాలను గట్టిగా వినిపించామని అన్నారు. దాని ఫలితంగా ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.