: పార్లమెంటు రాతి కట్టడమేనా..!: శివప్రసాద్
ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ కంటే గొప్పవాళ్లేం కాదని టీడీపీ ఎంపీ శివప్రసాద్ అన్నారు. పార్లమెంటు ఎలాంటి స్పందనలు లేని రాతి కట్టడంలా తయారైందని తీవ్ర విమర్శ చేశారు. పార్లమెంటు ముందు ఆయన మాట్లాడుతూ, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉభయసభలు గొంతునొక్కుతున్నాయని ఆరోపించారు. ఇక్కడి పాలకులు ప్రజాసమస్యల కంటే తమ స్వప్రయోజనాలు, అధికారాలే ముఖ్యమనేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గత నెల రోజులుగా తాము చేస్తున్న నిరసనలను కనీసం పట్టించుకోలేదని, పార్లమెంటు కట్టడంలానే అందులోని సభా నిర్వాహకులకు కూడా మనసులేదని రుజువైందని ఆయన విమర్శించారు.