: కేన్సర్ ప్రచార బాధ్యతలు చేపట్టనున్న యువరాజ్ సింగ్
కేన్సర్ తో పోరాడి బయటపడ్డ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరెంతో మందికి ఆదర్శంగా నిలవనున్నాడు. కేన్సర్ పై అవగాహన కోసం పంజాబ్ ప్రభుత్వం నిర్వహించే ప్రచారానికి యువరాజ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు యువరాజ్ ను సంప్రదించినట్లు పంజాబ్ వైద్య శాఖ వెల్లడించింది. ఈ నెల 28,29 తేదీలలో అన్ని జిల్లాలలో మెగా కేన్సర్ ప్రచార కార్యక్రమాలను పంజాబ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. యువరాజ్ ద్వారా ఎక్కువ మందిలో కేన్సర్ పై అవగాహన కల్పించడం వీలవుతుందని పంజాబ్ ప్రభుత్వం భావిస్తోంది.