: మహారాష్ట్ర కాలేజీలలో ప్రేమికుల దినోత్సవాలపై నిషేధం
మహారాష్ట్రలోని యూనివర్సీటీలు, కాలేజీలలో స్నేహితుల దినోత్సవం, ప్రేమికుల దినోత్సవం, రేవ్ పార్టీలపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించాలని కోరింది. 'విద్యార్థులు కాలేజీ జీవితంలో ఫ్రెండ్ షిప్ డే, వాలంటైన్స్ డే రేవ్ పార్టీలు, లిక్కర్ పార్టీలను జరుపుకుంటున్నారు. మహిళలు కూడా అందులో పాల్గొంటున్నారు. ఇలాంటి పార్టీల వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది' అంటూ మహారాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలకు సర్క్యులర్ జారీ చేసింది. వాటిపై నిషేధం విధించాలని, తమ పరిధిలోని అన్ని కాలేజీలలోనూ దీనిని అమలు చేసి నివేదిక సమర్పించాలని ఇటీవలే కోరింది.