: మోడీ పేరును అప్పుడే ప్రకటించొద్దంటున్న మధ్యప్రదేశ్ సీఎం
సార్వత్రిక ఎన్నికలకు రెండు సంవత్సరాల పైనుంచే ప్రధాని అభ్యర్ధిపై చర్చోపచర్చలు జరిపిన బీజేపీ నరేంద్ర మోడీ పేరునే ప్రకటించాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు అందరికీ తెలిసిన విషయమే. అయితే, మోడీని వ్యతిరేకిస్తున్న ఎన్ డీఏ కీలక భాగస్వామి జేడీయూ ఏకంగా కూటమి నుంచే తప్పుకుంది. ఇంకొందరు బయటినుంచి తమ ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మోడీకి 'నో' చెబుతున్నట్లే కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందే మోడీ పేరును ప్రకటించొద్దని చౌహాన్ బీజేపీకి చెప్పినట్లు ప్రచారం. గతవారం బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీతో ఈ విషయాన్ని చౌహాన్ చర్చించినట్లు సమాచారం. అయితే, ఈ ప్రచారాన్ని చౌహాన్ కార్యాలయం తిరస్కరిస్తోంది. మోడీకి వ్యతిరేకంగా రాతపూర్వకంగా ఎలాంటి లేఖను రాయలేదంటోంది.