: వినడంకన్నా చూపుకే ప్రాధాన్యత


వినిపించిన శబ్దంకన్నా కూడా కంటితో చూసిన విషయానికే మన మెదడు అధిక ప్రాధాన్యతనిస్తుందట. మన మెదడు విన్న దానికన్నా కూడా చూడడం వల్ల ఎక్కువ విషయాలను గుర్తుంచుకుంటుంది. అలాగే భాషను అర్ధం చేసుకునే ప్రక్రియలో మన మెదడు విన్న విషయానికన్నా కూడా చూసిన విషయాలపైనే ఎక్కువ ఆధారపడుతున్నట్టు శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో గుర్తించారు. దీనికి కారణం మన మెదడు వినికిడి శబ్దానికన్నా కూడా కంటి చూపుకు అధిక ప్రాధాన్యతనివ్వడమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

విన్న మాటలను విశదీకరించుకోవడంలో మెదడు, చూపు, శబ్దాలను రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే ఈ రెండింటి మధ్య ఏమాత్రం తేడాలున్నా కూడా విన్న శబ్దానికన్నా కూడా కంటి చూపుకే మెదడు అధిక ప్రాధాన్యతనిస్తుంది. దీన్ని మెక్‌గుర్క్‌ ప్రభావంగా పిలుస్తారు. ఈ విషయాన్ని చాలాకాలంగా పరిగణనలోకి తీసుకుంటున్నా దీనికి కారణమేమిటి? అనే విషయం ఇప్పటివరకూ తెలియరాలేదు. ఉటా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం ఈ విధంగా ఉండడానికి ప్రధాన కారణాన్ని తమ పరిశోధనల్లో గుర్తించింది. మెదడులో సంకేతాలను రికార్డు చేసి, విశ్లేషించి పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. వినబడిన శబ్దానికీ, అసలు శబ్దానికీ మధ్య తేడాలు ఉన్నట్టు మెదడులోని వినికిడి సంకేతాల ఆధారంగా పరిశోధకులు గుర్తించారు. ఈ విషయాన్ని గురించి అధ్యయనకర్త ఇలియట్‌ స్మిత్‌ మాట్లాడుతూ మనకు వినబడిన విషయానికి సంబంధించి మన అభిప్రాయం మారటంలో మెదడులోని వినికిడి భాగాన్ని చూపు ప్రభావితం చేస్తున్నట్టు గుర్తించామని అన్నారు.

  • Loading...

More Telugu News