: హార్వర్డ్‌ నంబర్ 1


ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అత్యున్నత విద్యావంతులను తీర్చిదిద్దిన ఘనతను హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిన ప్రముఖులను తయారుచేసిన విశ్వవిద్యాలయంగాను, పలు అంతర్జాతీయ సంస్థల్లో అత్యున్నత పదవులను నిర్వహించే వారిలో అత్యధికులను తీర్చిదిద్దిన విద్యాసంస్థగా ఈ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

గురువారం నాడు ప్రచురితమైన ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే ప్రధమస్థానంలో నిలిచింది. పాతికకు పైగా ఫార్చ్యూన్‌ 500 కంపెనీల సీఈవోలంతా హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన వారేనని ఒక పత్రిక పేర్కొంది. ఇప్పటి సీఈవోల్లో 2.6 శాతం మందిని తీర్చిదిద్దిన ఘనతను టోక్యో విశ్వవిద్యాలయం పొందింది. ఈ విశ్వవిద్యాలయం హార్వర్డ్‌ తర్వాత స్థానాన్ని పొందింది. మూడవ స్థానంలో 2.2 శాతం మంది సీఈవోను తయారు చేసిన స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం పొందింది. ప్రపంచంలోని పది అత్యున్నత విద్యాసంస్థల్లో నాలుగింటిని కలిగివున్న అమెరికా అగ్రస్థానంలో నిలువగా మూడు సంస్థలతో ఫ్రాన్స్‌, రెండింటితో జపాన్‌, తర్వాత స్థానంలో కొరియా ఉన్నాయి.

  • Loading...

More Telugu News