: న్యాయసేవ ప్రాధికార సంస్థ చైర్ పర్సన్ గా జస్టిస్ రోహిణి
రాష్ట్ర న్యాయసేవ ప్రాధికార సంస్థ నూతన చైర్ పర్సన్ గా జస్టిస్ జి.రోహిణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు ఈ సంస్థకు చైర్మన్ గా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దీంతో రాష్ట్ర హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రోహిణిని ఈ పదవికి నామినేట్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.