: సభ పెడితే చావుదెబ్బలే: పిడమర్తి రవి
ఏపీఎన్జీవోల సభపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో వ్యక్తం అవుతోంది. తెలంగాణ పొలిటికల్ జేఏసీ, ఎమ్మార్పీఎస్ ఇప్పటికే బాహాటంగా నిరసన భేరి మోగించగా.. తాజాగా ఉస్మానియా వర్శిటీ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి ఏపీఎన్జీవోలకు హెచ్చరికలు జారీ చేశాడు. సభ నిర్వహించేందుకు సిద్ధమైతే చావు దెబ్బలు తప్పవని స్పష్టీకరించాడు. దెబ్బలు తినకుండా ఉండాలంటే సభ జరపకపోవడమొక్కటే మార్గమని సూచించాడు. తమ హెచ్చరికలను పెడచెవినబెట్టి సభ నిర్వహణకే మొగ్గు చూపితే, తదనంతరం జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నాడు. ఈనెల 7న సీమాంధ్ర నుంచి హైదరాబాదుకు చేరుకునే అన్ని మార్గాలను దిగ్బంధం చేస్తామని పిడమర్తి వెల్లడించాడు.