: బాబుకు పిచ్చెక్కింది: గుత్తా


టీడీపీ అధ్యక్షుడు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి సరికాదంటున్నారు కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. సీమాంధ్రలో యాత్ర చేస్తున్న బాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థంకావడంలేదని గుత్తా విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చూస్తుంటే బాబు మతిస్థిమితం కోల్పోయినట్టుందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం సరైనదే అని ఎలా అంటారని ఈ నల్గొండ ఎంపీ ప్రశ్నించారు. రెండు కళ్ళ సిద్ధాంతంతో ముందుకెళుతున్న బాబు త్వరలోనే రెండు కళ్ళూ పోవడం ఖాయమని అన్నారు. ఆయన ప్రయత్నాలన్నీ సీమాంధ్రులకు దగ్గరయ్యేందుకేనని అర్థమవుతోందని గుత్తా చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News