: తెలంగాణ బంద్ కు టీ జేఏసీ పిలుపు
ఇరవై నాలుగు గంటల బంద్ కు తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చింది. రేపు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఎల్లుండి అర్ధరాత్రి 12 గంటలవరకు బంద్ ఉంటుందని జేఏసీ నేతలు చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరికి నిరసనగా తెలంగాణ బంద్ చేస్తున్నట్లు తెలిపారు. తక్షణమే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండు చేశారు.