: విశాఖ మ్యాచ్ డ్రా
భారత్-ఎ, న్యూజిలాండ్-ఎ జట్ల మధ్య జరుగుతున్న అనధికార టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆటకు నేడు చివరిరోజు కాగా కివీస్ రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 176 పరుగులు చేసిన తరుణంలో వాతావరణం అనుకూలించకపోవడంతో మ్యాచ్ నిలిపివేశారు. దీంతో, ఈ నాలుగురోజుల పోటీ పేలవ డ్రాగా ముగిసింది. అంతకముందు న్యూజిలాండ్-ఎ తొలి ఇన్నింగ్స్ లో 437 పరుగులు చేయగా, బదులుగా భారత్-ఎ 430 పరుగులు చేసింది. యువ ఆటగాడు మన్ ప్రీత్ జునేజా 193 పరుగులు చేయడం భారత ఇన్నింగ్స్ లో హైలైట్. ఇక 7 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ కు వరుణుడు అడ్డం తగిలాడు. దీంతో, ఇరుజట్ల కెప్టెన్లు అంగీకరించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.