: స్కూల్ కు వెళ్లాలంటే ఆ ఉపాధ్యాయుడు రోజూ నది ఈదుతాడు!


సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులంటే చులకన భావం ఎక్కువ. పనిచేసే కార్యాలయానికి సమయానికి రారని ప్రతీతి. అందునా ఉపాధ్యాయులంటే ప్రస్తుత కాలంలో ఆ భావం మరింత హెచ్చుగానే ఉంది. కానీ, ఓ ఉపాధ్యాయుడు మాత్రం తీసుకునే జీతానికి, చేస్తున్న పనికి సరికొత్త అర్ధం చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కేరళకు చెందిన అబ్దుల్ మాలిక్ అనే వ్యక్తి మలప్పురమ్ జిల్లాలోని ఓ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.

రోజూ పాఠశాలకు చేరుకునే క్రమంలో ఓ నది ఈది అక్కడి నుంచి మరో పదినిమిషాలు నడకసాగిస్తాడు. అదేంటి బస్సుమీదో, వాహనం పైనే వెళ్లొచ్చు కదా? అని ఆలోచన రావచ్చు. అందుకు అబ్దుల్ ఏం చెబుతున్నాడంటే.. 'బస్సుపైన పాఠశాలకు వెళ్లాలంటే నాకు మూడు గంటలు పడుతుంది. అదే షార్ట్ కట్ లో.. నది ఈది, అక్కడినుంచి వెళితే సమయానికి చేరుకోవచ్చు' అని వివరించారు. ఇలా 20 సంవత్సరాల నుంచి తాను నది ఈదే బడికి వెళతున్నానన్నాడు.

మరి నేడు ఉపాధ్యాయుల దినోత్సవం. ఈ రోజు అలాగే తరగతి గదికి వచ్చిన అబ్దుల్ ను ఒక్కసారిగా చుట్టుముట్టిన విద్యార్ధులు శుభాకాంక్షలు తెలుపుతూ గ్రీటింగ్ కార్డులు ఇచ్చారు. అతని జీతం 25వేలు. ఈ సందర్భంగా జహంగీర్ అనే ఏడు సంవత్సరాల విద్యార్ధి మాట్లాడుతూ.. పెద్దయ్యాక తాను మాలిక్ మాస్టర్ లా అవుతానంటూ చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News