: జైలు సిబ్బంది కోసం సంజయ్ దత్ విరాళాల సేకరణ
పుణెలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న నటుడు సంజయ్ దత్ ఈ నెల 26న తన ఆటపాటలతో అభిమానులను అలరించనున్నారు. పుణెలోని బాలగంధర్వ రంగమందిర్ ఆడిటోరియంలో 50 మంది తోటి ఖైదీలతోపాటు సంజయ్ దత్ కూడా పాల్గొంటున్నాడు. దీనికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. సిబ్బంది, వారి కుటుంబ సంక్షేమం కోసం విరాళాలు సేకరించేందుకు మహారాష్ట్ర జైళ్ల శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో హిందీ, మరాఠీ గీతాలకు డాన్స్ చేయడానికి సంజయ్ అంగీకరించినట్లు ఎరవాడ జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయ్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు తెలిపారు.