: నెల్లూరులో సమైక్యాంధ్రుల 'సింహగర్జన'
రాష్ట్ర విభజనకు నిరసనగా నెల్లూరు జిల్లాలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర 'సింహగర్జన'కు లక్షలాదిగా ఉద్యమకారులు తరలివచ్చారు. జిల్లావ్యాప్తంగా వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు, రైతులు, కూలీలు, వ్యాపారులు ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రజలు హాజరయ్యారు. 'సింహగర్జన' సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రతా బలగాలు చర్యలు చేపట్టాయి. సమైక్యాంధ్ర నినాదాలతో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం దద్దరిల్లిపోయింది.