: విద్యా సంవత్సరం కోల్పోయిన విద్యార్ధికి 3 లక్షల పరిహారం


సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (బీఎస్ఈ) పొరబాటుతో ఓ పదవ తరగతి విద్యార్ధి ఏడాదిపాటు విద్యా సంవత్సరం కోల్పోయిన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. దాంతో, ఆ విద్యార్ధి రాష్ట్ర హైకోర్టుకు వెళ్లడంతో సదరు విద్యార్ధికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని బోర్డును ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. భద్రక్ జిల్లాకు చెందిన సుమన్ పాణిగ్రాహీ అనే విద్యార్ధి స్థానిక బసుదేవ్ పూర్ పంచాయత్ హైస్కూల్లో చదివాడు. గతేడాది రాసిన పదవ తరగతి పరీక్షల్లో అతను ఒక్క గణితం తప్ప మిగతా అన్నింటిలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అందులో వందకు ఆరు మార్కులే రావడంతో ఫెయిల్ అయ్యాడు.

దాంతో, మళ్లీ రీ వాల్యూషన్ పెట్టించుకోవడంతో పాస్ అయినట్లు వచ్చింది. ఈలోపు అతను ఉన్నత చదువుకు వెళ్లేందుకు గడువు పూర్తవడంతో సంవత్సరంపాటు విద్యా సంవత్సరాన్ని కోల్పోయాడు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించిన అతను, బోర్డు నుంచి ఐదు లక్షల పరిహారాన్ని ఇప్పించాలని కోరాడు. విచారణ జరిపిన న్యాయస్థానం తాజా ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News