: ఒబామా, మన్మోహన్ సమావేశం షెడ్యూల్ ప్రకారమే..
భారత ప్రధాని మన్మోహన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాల సమావేశం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్ 27న జరుగనుంది. సిరియా సంక్షోభం కారణంగా అమెరికా అధ్యక్షుడు బిజీగా ఉన్నప్పటికీ ఈ సమావేశం యథావిధిగా జరుగుతుందని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం జీ-20 సదస్సు సందర్భంగా వీరిద్దరి అధికారిక సమావేశాలేవీ లేవు. ఈ సదస్సు సందర్భంగా మన్మోహన్ సింగ్ చారిత్రాత్మక ప్రసంగం చేయనున్నారు. అగ్రదేశాల వ్యవహారశైలి కారణంగా అభివృద్ధి చెందుతున్న వర్థమాన దేశాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. దాన్ని అధిగమించాలంటే అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల ఆర్ధిక వ్యవస్థల మధ్య సమతౌల్యాన్ని పాటించాల్సిన అవసరాన్ని ప్రస్తావించనున్నారు. ప్రస్తుతం రష్యాలో జరుగుతున్న జీ-20 సదస్సు సందర్భంగా వీరిరువురు సమయాన్ని బట్టి అనధికారికంగా కలిస్తే కలవొచ్చు.