: మార్చి నాటికి డీజిల్ నానో
సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా నానో మరిన్ని వెర్షన్లలో మార్కెట్లోకి రానుంది. వచ్చే మార్చి నాటికి నానో డీజిల్ మోడల్ ను టాటా మోటార్స్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ప్రస్తుతం నానో పెట్రోల్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, పెట్రోల్ ధరతో పోలిస్తే డీజిల్ ధర తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో, డీజిల్ మోడల్ కోసం ఎంతోమంది వేచి చూస్తున్నారు. నానో అమ్మకాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో డీజిల్, సీఎన్ జీ వెర్షన్లను కూడా తీసుకురావడం ద్వారా అమ్మకాలను పెంచుకోవాలని టాటా మోటార్స్ ఆశిస్తోంది.