: సిద్ధూ ఆచూకీ లభించింది!
పది నెలలుగా సొంత నియోజకవర్గాన్ని విడిచిపెట్టి తిరుగుతున్న బీజేపీ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎట్టకేలకు అమృత్ సర్ లో అడుగుపెట్టారు. తన నియోజకవర్గ ప్రజలకు దర్శనం ఇచ్చారు. తాను ముంబై వెళ్లింది సంపాదన కోసమేనని ఆయన చెప్పారు. అరుణ్ జైట్లీ న్యాయవాదిగా ఉండగా లేనిది, టీవీ వ్యాఖ్యాతగా తాను పనిచేస్తే తప్పేంటి? అంటూ ఆయన విమర్శకులను ప్రశ్నించారు. సంపాదన యావ ఉన్నప్పుడు.. ప్రజాసేవతో ముడిపడి ఉన్న ఎంపీ పదవి ఎందుకో సిద్ధూ భయ్యా చెప్పలేదు. అయితే, ఇకపై నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని వరమిచ్చారు. సిద్ధూ ఆచూకీ లభించడంలేదని, అతడి జాడ గురించి చెప్పిన వారికి రెండు లక్షల రూపాయల రివార్డు ఇస్తామంటూ కొన్ని రోజుల క్రితమే అమృత్ సర్ కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.