: 'రూటు' మార్చిన షర్మిల
వైఎస్సార్సీపీ నేత షర్మిళకు సమైక్య సెగ తగిలింది. అనంతపురం జిల్లా పామిడిలో షర్మిళ కాన్వాయ్ ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా సమైక్యాంధ్ర కోసం పోరాడాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. రాజకీయ పార్టీలన్నీ జెండాలను వదిలి ఉద్యమంలో కలిసిరావాలని వారు కోరారు. ప్రజలంతా ఉద్యమంతో ఒక్కటిగా ముందుకు వెళ్తుంటే రాజకీయనాయకులు రాజకీయ ప్రయోజనాలను అభిలషించడం వారి వక్రబుద్ధిని సూచిస్తుందని మండిపడ్డారు. సమైక్యవాదుల నిరసనలతో షర్మిళ మరోమార్గంలో కర్నూలు వెళ్లారు.