: రండి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించండి.. వాస్తవాలు చూడండి: సీఎం రమేశ్


రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ రాష్ట్రానికి రండంటూ రాజ్యసభ సభ్యులను ఆహ్వానించారు. యూపీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవైపు కమిటీ వేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి.. మరోవైపు రాష్ట్రాన్ని 125 రోజుల్లో విభజిస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. 'కావాలంటే గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు రాష్ట్రంలో పర్యటించండి, వాస్తవపరిస్థితిని వీక్షించండి' అంటూ ఆహ్వానించారు. కాంగ్రెస్ ద్వంద్వనీతితో రాష్ట్రాన్ని రావణ కాష్ఠం చేస్తోందని, ప్రజాప్రతినిధులుగా తాము ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తున్నామని రమేశ్ అన్నారు.

  • Loading...

More Telugu News