: ఇంజినీరింగ్ విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖీ
గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విభజన అంశంపై అన్ని వర్గాలవారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఉదయం మోతడకలోని చలపతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులతో బాబు అభిప్రాయాలు పంచుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు.