: మతిమరుపుకు కొత్త మందులు


ఇక పార్కిన్సన్స్‌ వ్యాధికి కొత్త రకం మందులను శాస్త్రవేత్తలు తయారు చేయనున్నారు. ఈ వ్యాధి కారణంగా మెదడులోని కణాలు బలహీనపడి చనిపోకుండా, వాటి పనితీరు మందగించకుండా ఆపగలిగేలా మంచి శక్తిమంతమైన ఔషధాలను శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు. ఈ మందులను తయారు చేసి వాటిద్వారా ఈ వ్యాధినుండి బాధితులను రక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

షెఫీల్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌లేషనల్‌ న్యూరోసైన్స్‌ పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతున్న వారి చర్మ కణాలపై ప్రయోగశాలలో చేపట్టిన భారీ ఔషధ ప్రయోగాల ద్వారా ఒక అంశాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రయోగాల్లో రెండు వేలకుపైగా రసాయన కాంపౌండ్లను శాస్త్రవేత్తలు పరీక్షించారు. దీనిద్వారా ఉర్సోడియోక్సికోలియాసిడ్‌ (యూడీసీఏ) అనే ఔషధం ఈ వ్యాధి నివారణలో చక్కగా తోడ్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. చాలా ఏళ్లుగా కాలేయ జబ్బుల్లో వాడుతున్న ఈ ఔషధం పార్కిన్సన్స్‌ వ్యాధి బాధితులకు ఎంతగానో మేలు చేస్తుందనే దిశగా క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టనున్నారు. దీనిద్వారా యూడీసీఏ ఔషధం ఉపయోగంపై మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నారు.

పార్కిన్సన్స్‌ వ్యాధి విషయంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధాలు కొన్ని లక్షణాలనుండి ఉపశమనం కలిగించేవి మాత్రమేనని, వ్యాధి వృద్ధిని తగ్గిస్తూ నియంత్రణ సాధించే దిశగా కొత్త తరహా చికిత్సలు అవసరమనీ పరిశోధకులు డాక్టర్‌ ఒలివర్‌ బ్యాండ్‌మాన్‌ చెబుతున్నారు. ఈ తరహా ఔషధాలు ఏదోఒకరోజు పార్కిన్సన్స్‌ వ్యాధిగ్రస్థుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News