: నిద్రపోతే మరమ్మత్తు జరుగుతుంది


చక్కగా నిద్రపోతే మనం ఆరోగ్యంగా ఉండడమేకాదు... మనకు మానసికపరమైన చిరాకు కూడా దూరంగా ఉంటుంది. అంతేకాదు... కంటినిండా నిద్రపోవడం వల్ల మన మెదడు కూడా చక్కగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. నిద్రపోవడం వల్ల మన మెదడులో ఒక రకం కణాల సంఖ్య పెరుగుతుందని, ఫలితంగా గాయాలపట్ల అవయవాల స్పందన మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

స్విట్జర్లాండ్‌లోని లాసానే విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మన మెదడుపై నిద్ర మంచి ప్రభావాన్ని చూపుతుందని వారి పరిశీలనలో గుర్తించారు. నిద్రపోవడం వల్ల మెదడులో ఒక రకం కణాలను నిద్ర పెంచుతుందని, దీని ఫలితంగా గాయాల పట్ల మన అవయవాల స్పందన మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు తమ పరిశీలనలో గుర్తించారు. మెదడు, వెన్నెముకపైన ఉండే మైలిన్‌ పొరను ఏర్పరిచే కణాల పునరుత్పత్తిని నిద్ర పెంచుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

తాము నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలతో మెదడు మరమ్మతు, వృద్ధిలో నిద్ర పాత్రపై సరికొత్త అంశాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. విస్కాన్సిస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చియారా సిరెల్లి ఒలిగోడెండ్రోక్రైట్స్‌ వంటి ప్రత్యేక కణ రకాల జన్యువుల క్రియాశీలతను గురించి పరిశీలించారు. అయితే తాజా అధ్యయనంతో నిద్ర పోవడం అనేది మెదడును ఎలా మరమ్మత్తు చేస్తుంది, నిద్ర లేకపోవడం అనేది మెదడును ఎలా దెబ్బతీస్తుంది? అనే అంశాలను గుర్తించాయని ఈ పరిశోధనలో పాల్గొన్న మెహ్దీ టఫ్టీ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News