: రాంచరణ్ సినిమాలకు రక్షణ కల్పించాలని హైకోర్టులో పిటీషన్
మెగాపవర్ స్టార్ రాంచరణ్ సినిమాలకు రక్షణ కల్పించాలని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. రాంచరణ్ నటించిన జంజీర్, ఎవడు సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. కానీ రాష్ట్రంలో ఉద్యమాలు తీవ్రం కావండంతో సినిమాలను అడ్డుకుంటామని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ సినిమాల ప్రదర్శనకు రక్షణ కల్పించాలని ఆయా చిత్రనిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. వీటిపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశముందని వీరితరపు న్యాయవాదులు తెలిపారు.