: కర్నూలు జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు.. నలుగురు గల్లంతు


కర్నూలు జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోడుమూరు, బోనిగండ్ల మండలాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కోడుమూరులోని తుమ్మలవాగు, మొండికట్టవాగు, మఠం వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అల్వాల గ్రామానికి చెందిన క్రైస్తవులు ప్రార్థనలు ముగించుకుని ఎమ్మిగనూరు నుంచి వస్తూ మఠంవాగు దాటే క్రమంలో వరదనీరు చుట్టుముట్టడంతో గల్లంతయ్యారు. వారిలో స్వర్ణలత(14), హేమలత(24), హేమలత కుమారుడు సూరి(6 నెలలు), మునియమ్మ(56)లు ఉన్నారు. గ్రామస్తుల గాలింపు చర్యల్లో ముగ్గురు మహిళల మృతదేహాలు లభ్యమయినా సూరి ఆచూకీ లభించలేదు.

  • Loading...

More Telugu News