: జీహెచ్ఎంసీ అధికారుల నిర్బంధం


రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం ఫిర్జాదిగూడలో జీహెచ్ఎంసీ అధికారులను గ్రామస్తులు నిర్బంధించారు. జీహెచ్ఎంసీలో గ్రామాన్ని విలీనం చేసిన సందర్భంగా ఆ గ్రామానికి చెందిన పంచాయతీ దస్త్రాలు స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వచ్చారు. దీంతో తమ గ్రామాన్ని విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. అయినప్పటికీ విలీనం జరిగిపోయిందని చేయగలిగిందేమీ లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఉపకమిషనర్ మహేందర్, డిప్యూటీ ఈఈ నాగేందర్, ఇతర సిబ్బందిని గ్రామస్తులు నిర్బంధించారు.

  • Loading...

More Telugu News