: ఉందిలే, మంచి కాలం ముందు ముందూనా!
భారత ఆర్ధిక వ్యవస్థకు మున్ముందు మంచిరోజులు వస్తాయని ఆర్బీఐ నూతన గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. మన ఆర్ధిక వ్యవస్థ బలంగానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దువ్వూరి సుబ్బారావు స్థానంలో గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం కష్టకాలమేనన్నారు. ఎన్నో సవాళ్ళు నిలిచి ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ బాండ్లమీద బ్యాంకులు పెట్టుబడులు పెట్టడాన్ని తగ్గించాలని, మార్కెట్ రెగ్యులేటర్ తో కలిసి ప్రభుత్వం మార్కెట్ల సరళీకరణకు కృషి చేయాలని రాజన్ సూచించారు.