: రైలు వరాలు.. విజయవాడలో రైల్ నీరు బాట్లింగ్ కేంద్రం
2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5.19 లక్షల కోట్ల రూపాయలతో రైలు బడ్జెట్ ను మంత్రి బన్సల్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
* విజయవాడలో కొత్తగా రైలు నీరు బాట్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇలా దేశ వ్యాప్తంగా మొత్తం ఆరు స్టేషన్లలో ఏర్పాటు.
* రైళ్లలో పర్యావరణ అనుకూలమైన బయో టాయిలెట్లు ఏర్పాటు.
* 17 కాలం చెల్లిన వంతెనల స్థానంలో కొత్తవి నిర్మిస్తాం.
* మహిళల కోసం రైళ్లలో ప్రత్యేక కోచ్ లు
* జోనల్ రైల్వేలలో మహిళల భద్రతకు హెల్ప్ లైన్లు
* ఎ 1 స్థాయి 117 స్టేషన్ లలో ఎస్కలేటర్లు, 400 లిఫ్టుల ఏర్పాటు