: ఇండియన్ ముజాహిదీన్ లో చీలికలు!
హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో అరెస్టయిన యాసిన్ భత్కల్ పలు ఆసక్తికర విషయాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)విచారణలో వెల్లడిస్తున్నాడు. ఉగ్రవాద దాడులతో రెచ్చిపోతున్న 'ఇండియన్ ముజాహిదీన్'లో గొడవల కారణంగా చీలికలు ఏర్పడ్డాయని చెప్పాడని సమాచారం. దానివల్లే భారత్ కమాండర్ గా ఉన్న ఎహ్సాన్ అక్తర్ అలియాస్ మోను స్థానంలో తనను నియమించినట్లు తెలిపాడట. మరోవైపు భత్కల్ ను మరికొంతమంది ఉగ్రవాదులతో కలిపి విచారించాలని ఎన్ఐఏ భావిస్తోంది. బుద్ధగయ పేలుళ్లలో తన ప్రమేయం లేదన్న అతని మాటల్లో ఎంత వాస్తవం ఉందో తెలుసుకోవడానికి ఇలా విచారణ చేయాలని అధికారులు అనుకుంటున్నారు.