: రఘురాం రాజన్ అసాధ్యుడు సుమీ.. ప్రముఖుల నమ్మకం


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్ రఘురాం రాజన్ అసాధ్యుడని పలువురు ప్రముఖులు ప్రస్తుతించారు. మాజీ గవర్నర్, ఆర్ధిక వేత్త, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ సి రంగరాజన్ మాట్లాడుతూ.. రాజన్ నియామకం అద్భుతమని అన్నారు. అయితే ఫారెక్స్ మార్కెట్లో అస్థిరత్వంపై ఆయన మొదట దృష్టి పెట్టాలని సూచించారు. మరో మాజీ గవర్నర్ బిమల్ జలాన్ మాట్లాడుతూ, రాజన్ కి తన సానుభూతి తెలిపారు. తానైతే ప్రస్తుత పరిస్థితుల్లో పదవిని చేపట్టేవాడిని కాదని అన్నారు. ఇప్పుడు ద్రవ్యోల్బణం కన్నా వృద్ధిరేటుకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. రఘు అసాధారణమైన వ్యక్తని తెలిపారు. ఆయన సమర్థత చాటడానికి ఆయన చదువుకున్న విద్యాసంస్థలే చాలని అన్నారు. మంచి నిర్ణయాలు తీసుకుని మంచి గవర్నర్ గా రాణిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ ఆర్థిక వేత్త డాక్టర్ బృందా జాగీర్థార్ మాట్లాడుతూ.. రఘురాం మాట్లాడితే ప్రపంచం వింటుందని అన్నారు. కొత్త ఆలోచనలను మనసారా స్వాగతిస్తారని అన్నారు. ఆయన మంచి శ్రోత అని తెలిపారు.

  • Loading...

More Telugu News