: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవినీతి జరగలేదు: ఉక్కు మంత్రి


బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణీ ప్రసాద్ వర్మ అన్నారు. అయితే, సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరుగుతోందని, కోల్ కేటాయింపుల్లో ఎలాంటి స్కాం లేదనే తేల్చుతుందని ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పేర్కొన్నారు. మరోవైపు బొగ్గు కేటాయింపుల్లో స్కాంకు సంబంధించిన వందల ఫైళ్లు గల్లంతైన సంగతి తెలిసిందే. దాంతో, ఇప్పటివరకు ఫైళ్ల గల్లంతుపై కేసు నమోదు చేయలేదని ప్రతిపక్ష బీజేపీ పార్లమెంటులో మండిపడుతోంది.

  • Loading...

More Telugu News